ఏమాయే నా కవిత

ImageImageImage

నెలే పొడిచెనని చంద్రుడొచ్చెనని తుల్లి పడెనులె నా హృదయం
నీడ చూసీనా నువ్వేనంటు ఈ హృదయం పొంగి పొరలు ||నెలే పొడిచెనని||

ఏమాయే నా కవిత కలలలో రాసుకున్న కవిత
ఏమాయే నా కవిత కలలలో రాసుకున్న కవిత
కళ్ళలో కలిసెనో అమ్మమ్మ వెకువే చెరిపెనో
కవిత వెతికివ్వండి లేక నా కలను తిరిగివ్వండి
ఏమాయే నా కవిత కలలలో రాసుకున్న కవిత
ఏమాయే నా కవిత కలలలో రాసుకున్న కవిత

సంద్యవేళలో మనసుమూల మరుగైన మోము మది వెతికెలే
మండుటెండలో నగర వీధిలో మసలి మసలి మది వాడెలె
మబ్బు చిందు చిరు చినుకు చినుకు కు మధ్య నిను మది వెతికెలె
అలల నురుగులో కలల ప్రేమికుని గుచ్చి గుచ్చి మది వెతికెలె
సుందర వదనం ఒక పరి చూచిన మనసే శాంతించు
నులివ్రేళ్ళతో నువ్వొకపరి తాకిన మళ్ళి మళ్ళి పుట్టెదనే ||నెలే పొడిచెనని||

ఏమాయే నా కవిత కలలలో రాసుకున్న కవిత
ఏమాయే నా కవిత కలలలో రాసుకున్న కవిత

ఒకే చూపుని ఒకే మాటని ఒకే స్పర్శ మది కోరెలే
ముద్దులిచ్చు మురిపాల సెగలను ఎల్లవెలల కోరెలే
చెమట నీటినె మంచి గంధముగ ఎంచమని మది కోరెలే
మోముపైన కేశములు గుచ్చిన తీపి హాయి చెప్ప కోరెలే…కోరెలే…
రాయితో చేసిన మనసే నాదని చెలియకు తెలిపితినే
రాయి మధ్యలో పెరిగిన లతలా నువు నాలో తొలచితివే

ఏమాయే నా కవిత కలలలో రాసుకున్న కవిత
ఏమాయే నా కవిత కలలలో రాసుకున్న కవిత

 

రాగాల పల్లకిలో కోయిలమ్మ

రాగాల పల్లకిలో కోయిలమ్మ రాలేదు ఈవేళ ఎందుకమ్మ
నా ఉద్యోగం పోయిందండి !
తెలుసు. అందుకే..రాలేదు ఈవేళ కోయిలమ్మ..రాగాలే మూగబోయినందుకమ్మ

రాగాల పల్లకిలో కోయిలమ్మ రాలేదు ఈవేళ ఎందుకమ్మ
రాలేదు ఈవేళ కోయిలమ్మ..రాగాలే మూగబోయినందుకమ్మ
రాగాల పల్లకిలో కోయిలమ్మ రాలేదు ఈవేళ ఎందుకమ్మ..ఎందుకమ్మ

పిలిచిన రాగమే పలికిన రాగమే కూనలమ్మకి..మూగతీగ పలికించే వీనలమ్మకి
పిలిచిన రాగమే పలికిన రాగమే కూనలమ్మకి..మూగతీగ పలికించే వీనలమ్మకి
బహుశా అది తెలుసో ఏమో..
బహుశా అది తెలుసో ఏమో..జాణ కోయిల రాలేదు ఈ తోటకి ఈ వేళ
రాగాల పల్లకిలో కోయిలమ్మ రాలేదు ఈవేళ అందుకేనా అందుకేనా
గుండెలో బాధలే గొంతులో పాటలై పలికినప్పుడు
కంటిపాప జాలికి లాలి పాడినప్పుడు
గుండెలో బాధలే గొంతులో పాటలై పలికినప్పుడు
కంటిపాప జాలికి లాలి పాడినప్పుడు
బహుశా తను ఎందుకనేమో లలలా లల లల లల లాలా
బహుశా తను ఎందుకనేమో గడుసు కోయిల రాలేదు ఈ తోటకి ఈ వేళ
రాగాల పల్లకిలో కోయిలమ్మ..రాలేదా నీవుంటే కూనలమ్మ
రాగాల పల్లకిలో కోయిలమ్మ..రాలేదా నీవుంటే కూనలమ్మ

సీతారామ చరితం…శ్రీ సీతారామ చరితం…

rama1

సీతారామ చరితం…శ్రీ సీతారామ చరితం…గానం జన్మ సఫలం…శ్రవణం పాప హరణం
ప్రతి పద పదమున శ్రుతిలయాన్వితం చతుర్వేద వినుతం లోకవిదితం
ఆది కవి వాల్మీకి రచితం… సీతారామ చరితం…

కోదండపాణి ఆ దండకారణ్యమున కోలువుండె భార్యతో నిండుగా…
కోదండపాణి ఆ దండకారణ్యమున కోలువుండె భార్యతో నిండుగా…
అండ దండగ తమ్ముడుండగ… కడలి తల్లికి కనుల పండుగ…
సుందర రాముని మోహించె… రావణ సోదరి సూర్పణఖ …
సుద్దులు తెలిపి పొమ్మనిన…హద్దులు మీరీ పైబడగ…
తప్పనిసరియై లక్ష్మణుడే…ముక్కు చెవులను కోసే…
అన్నా చూడని అక్కసు కక్కుతు,రావణు చేరెను రక్కసి…
దారుణముగ మాయ చేసి రావణుడు మాయ లేడి అయినాడు మారీచుడు…
సీత కొరకు దాని వెనుక పరిగెడి శ్రీ రాముడు…అదను చూసి సీతను అపహరించె… రావణుడు…
కడలి నడుమ లంకలోన, కలికి సీతనుంచె..కరకు గుండె రాకాసుల కాపలాగ ఉంచె…

శోక జలది తనైనది వైదేహి… ఆ శోక జలది లో మునిగె దాశరధి…
సీతా..సీతా..ఆ..ఆ..సీతా..సీతా..అని సీతకు వినిపించేలా..రోదసి కంపించేలా…రోదించే.. సీతాపతి…

రాముని మోమున దీనత చూసి..వెక్కి ఏడ్చినవి వేదములే..సీతకెందుకీ విషాదం…
రామునికేల వియోగం..కమల నయనములు మునికే..పొంగే కన్నీటిలో…
చూడలేక సూర్యుడే..దూకెను మున్నీటిలో..చూడలేక సూర్యుడే..దూకెను మున్నీటిలో…
వానర రాజగు సుగ్రీవునితో రాముని కలిపె మారుతి..జలదిని దాటీ లంకను చేరగ కనబడెనక్కడ జానకి…
రాముని ఉంగరం అమ్మకు ఇచ్చి, రాముని మాటల ఓదార్చి…
లంకను కాల్చి రయిమని వచ్చి, సీత శిరోమణి రామునికిచ్చి…
చూసినదంత, చేసినదంత, తెలిపె పూస గుచ్చి…
వాయువేగమున వానర సైన్యము కడలికి వారధి కట్టెరా…
బాణవేగమున రామభధ్రుడా రావణ తల పడగొట్టెరా…
ముదమున చేరని కులసతి సీతని దూరముగా..నిలబెట్టెరా..
అంతబాదపడి సీతకోసమని..ఇంత చేసి శ్రీ రాముడు…
చెంతచేర జగమంత చూడగ..వింత పరీక్ష విదించెను..

ఎందుకు ఈ పరీక్ష..ఎవ్వరికీ పరీక్ష…
శ్రీ రాముని భార్యకా శీల పరీక్ష..అయోనిజకి అవనిజకా, అగ్ని పరీక్ష…
దశరధుని కోడలికా ధర్మ పరీక్ష..జనకుని కూతురికా అనుమాన పరీక్ష…
రాముని ప్రాణానికా,జానకి దేహానికా,సూర్యుని వంశానికా,ఈ లోకం నోటికా..
ఎవ్వరికీ పరీక్ష..ఎందుకు ఈ పరీక్ష..శ్రీ రామా…
అగ్గిలోకి దూకే అవమానముతో సతి…
అగ్గిలోకి దూకే అవమానముతో సతి…నిగ్గు తేలి సిగ్గుపడె సందేహపు జగతి…
అగ్నిహోత్రుడె పలికె దిక్కులు మార్మోగగ…
సీత మహాపతివ్రతని జగమె ప్రణమిల్లగా…
లోకులందరికి సీత పునీతని.. చాటె నేటి శ్రీ రాముడు…
ఆ జానకి తో అయోధ్యకేగెను …సకల ధర్మ సందీపుడు…
సీతా సమేత శ్రీ రాముడు…..