లాలి లాలి అను రాగం

Image

లాలి లాలి అను రాగం సాగుతుంటె ఎవరూ నిదురపోరె
చిన్న పోదామరి చిన్ని ప్రాణం
కాసె వెన్నెలకు వీచే గాలులకు హృదయం కుదుట పడదె
అంత చేదా మరీ వేణు గానం
కళ్ళు మేలుకుంటె కాలమాగుతుంద భారమైన మనసా
ఆ .. పగటి బాధలన్ని మరచిపొవుటకు
ఉంది కాద ఈ ఏకాంత వేళ

లాలి లాలి అను రాగం సాగుతుంటె ఎవరు నిదురపోరె
చిన్న పోదామరి చిన్ని ప్రాణం

సమగప పమపమా గరి గారిసని
సమగప పమపమా…
సమగప పమపమా గరి గరిసని
సమగప సగమా … ఆ..
గమ దదమ నినిద సనిరి సా నిదప
గమ దదమ నినిద గరిసనిదపమగ

ఎటో పోయేటి నీలి మేఘం
వర్షం చిలికి వెల్లద సా .. సరిగరి గ గరి గపమగ
ఎదొ అంటుంది కోయెల పాట
రాగం ఆలకించద సా .. సరిగరి గ గరి గదమగ
అన్ని వైపుల మధువనం … పూలు పూయద అను క్షణం
అనువనువున జీవితం …అంద చేయద అమృతం

లాలి లాలి అను రాగం సాగుతుంటె ఎవరూ నిదురపోరె
చిన్న పోదామరి చిన్ని ప్రాణం
కాసె వెన్నెలకు వీచె గాలులకు హృదయం కుదుట పడదె
అంత చేదా మరీ వేణు గానం

రామాయణము శ్రీ రామాయణము

ramayanamu

రామాయణము శ్రీ రామాయణము రామాయణము శ్రీ రామాయణము
అడుగడుగున త్యాగము అణువణువున ధర్మము
అడుగడుగున త్యాగము అణువణువున ధర్మము
అనురాగము అనుబంధము అనుపమానము
అనురాగము అనుబంధము అనుపమానము
సహన శీల ధీర వీర వరద భీరము
సహన శీల ధీర వీర వరద భీరము
రామాయణము శ్రీ రామాయణము రామాయణము శ్రీ రామాయణము

శ్రీ రామ పట్టాభిషేకం ధశరధుడు చేసె ఆదేశం
శ్రీ రామ పట్టాభిషేకం ధశరధుడు చేసె ఆదేశం
వుప్పొంగి పోయె ఆ దేశం వుప్పొంగి పోయె ఆ దేశం
కలవరం తెచ్చింది కైకకిచ్చిన వరం
కానలకు పంపమని లేక యే కనికరం
ఫదునాలుగేండ్లు శ్రీరాముని వనవాసమును చేయమన్నది వనవాసమును చేయమన్నది

చెదరని ధరహాసం…కదిలెను వనవాసం
చెదరని ధరహాసం…కదిలెను వనవాసం
వదలి రాణివాసం…వచ్చె మగని కోసం
తండ్రి మాట కోసం…కొడుకు తండ్రి కోసం
తండ్రి మాట కోసం…కొడుకు తండ్రి కోసం
భార్య మగని కోసం…లక్ష్మన్న అన్న కోసం
జనమంతా ఆక్రోశం…జనమంతా ఆక్రోశం జనమంతా ఆక్రోశం

ఏమయ్య రామయ్య ఏమైపోవాలయ్యా మేమేమైపోవాలయ్యా
ఏమయ్య రామయ్య ఏమైపోవాలయ్యా మేమేమైపోవాలయ్యా

అటు పురజనులు ఇటు ధశరధులు ఎక్కి ఎడ్చినారు మొక్కి ఆపినారు..
సత్య వచనమై సాగెను రఘుపతి ధర్మ కవచమై అనుసరించె సతి…
లక్ష్మణుడేగెను వినయ శీలుడై అయోధ్య మిగిలెను అమావాస్యయ్ అయోధ్య మిగిలెను అమావాస్యయ్

రామాయణము శ్రీ రామాయణము
అడుగడుగున త్యాగము అణువణువున ధర్మము
అడుగడుగున త్యాగము అణువణువున ధర్మము
అనురాగము అనుబంధము అనుపమానము
అనురాగము అనుబంధము అనుపమానము
సహన శీల ధీర వీర వరద భీరము
సహన శీల ధీర వీర వరద భీరము
రామాయణము శ్రీ రామాయణము
రామాయణము రామాయణము