కలికి చిలకల కొలికి మాకు మేనత్త

 

కలికి చిలకల కొలికి మాకు మేనత్త
కలవారి కోడలు కనక మాలక్ష్మి
అత్త మామల కొలుచు అందాల అతివ
పుట్టిల్లు యెరుగని పసి పంకజాక్షి…
మేనాలు తేలేని మేనకొడల్ని
అడగ వచ్చా మిమ్ము ఆడ కూతుర్ని
వాల్మికినె మించు వరస తాతయ్య
మా ఇంటికంపించవయ్య మావయ్య ఆ ఆ ఆ…

కలికి చిలకల కొలికి మాకు మేనత్త
కలవారి కోడలు కనక మాలక్ష్మి

ఆ చెయ్యి ఈ చెయ్యి అత్త కోడలికి
ఆ మాట ఈ మాట పెద్ద కోడలికి
నేటి అత్తమ్మా నాటి కోడలివి
తెచ్చుకో మాయమ్మ నీవు ఆ తెలివి…
తల లోని నాలికై తల్లిగ చూసే
పూలల్లో దారమై పూజలె చేసె
నీ కంటి పాపలా కాపురం చేసె
మా చంటి పాపను మన్నించి పంపు…
కలికి చిలకల కొలికి మాకు మేనత్త
కలవారి కోడలు కనక మాలక్ష్మి
మసక బడితె నీకు మల్లె పూదండ
తెలవారితే నీకు తేనె నీరెండ
యేడు మల్లెలు తూగు నీకు ఇల్లాలు
యేడు జన్మల పంట మా అత్త చాలు…
పుట్టగానే పువ్వు పరిమళిస్తుంది
పుట్టింటికె మనసు పరుగు తీస్తుంది
తెలుసుకో తెలుసుకో తెలుసుకో
తెలుసుకో తెలుసుకో మనసున్న మామ
సయ్యొధ్యనేలేటి సాకెత రామ…
కలికి చిలకల కొలికి మాకు మేనత్త
కలవారి కోడలు కనక మాలక్ష్మి

 

 

ఉరుములు నీ మువ్వలై

ఉరుములు నీ మువ్వలై మెరుపులు నీ నవ్వులై
తొలకరి మేఘానివై రా అలివేణి
పరుగులు నీ గానమై తరగలు నీ తాళమై
చిలిపిగ చిందాడవే కిన్నెరసాని
కాలానికే కాలాడక ఆగాలి నువ్వు ఆడే వేళ
అది చూడగ మనసాగక ఆడాలి నీతో నింగినేల
తఖధిమి తాళాలపై తళుకుల తరంగమై
చిలిపిగ చిందాడవే కిన్నెరసాని
మెళికల మందాకిని కులుకుల బృందావని
కనులకు విందీయవే ఆ అందాన్ని

చంద్రుల్లో కుందేలే మా ఇంట ఉందంటూ
మురిసింది ఈ ముంగిళి
చిందాడే కిరణంలా మా ముందు నువ్వుంటే
ప్రతి పూట దీపావళి
మా కళ్ళళ్ళో వెలిగించవే సిరివెన్నెల..
మా ఆశలే నీ అందెలై
ఈ మంచు మౌనం మోగేవేళ
ఆ సందడే ఆనందమై
ప్రేమించు ప్రాణం పాడేవేళ
ఉరుములు నీ మువ్వలై మెరుపులు నీ నవ్వులై
తొలకరి మేఘానివై రా కళ్యాణి
తఖధిమి తాళాలపై తళుకుల తరంగమై
చిలిపిగ చిందాడవే కిన్నెరసాని

నడయాడే నీ పాదం నటవేదమేనంటూ
ఈ పుడమే పులకించగా
నీ పెదవే తన కోసం అనువైన కొలువంటు
సంగీతం నిను చేరగా
మా గుండెనే శ్రుతి చేయవా నీ వీణలా
ఈ గాలిలో నీ కేళితో రాగాలు ఎన్నో వేగేవేళ
నీ మేనిలో హరివిల్లులే వర్ణాల వాగై సాగేవేళ

ఉరుములు నీ మువ్వలై మెరుపులు నీ నవ్వులై
తొలకరి మేఘానివై రా అలివేణి