మచిలిపట్నమామిడి చిగురులో

 

ఒహొ హూ లలల ఒహూ లలల
ఒ హులల హుల హులల
మచిలిపట్నమామిడి చిగురులో
పచ్చని చిలక అలిగి అడిగిందేమిటంట
నా కంటికెంపులలక
నా రెక్క నునుపు తళుకా
చిలకా దేవి కన్ను గీట సాగె నా పల్లవి |ఒహొ|

మెట్టదారి ఇదే బండికి వాలు ఇదే
ఓ పోంకాలపోరి ఒకటి
కోరి కట్టుకున్న చీర పొగరు చూసా
వాన విల్లు వర్ణం అహా
మలసిన మల్ల వాన చింది చింది సుధ చిలికే నయగారం
మరి యెద వాలి గిల్లి కొత్త తాళమడిగినదె చెలగాటం |హు|

తందాన తందాన తాకి మరీ తందాన
ఏ తాళం వాయించాడె
తందాన తందాన పాట వరస తందాన
ఏ రాగం పాడిస్తాడె
సిరి వలపో మతి మరుపో అది హాయిలె
సిరి పెదవో విరి మధువో ప్రియమేనులె
తందాన తందాన కన్నె ప్రేమ తందాన వచ్చిపొయె వాసంతాలె
మనసిజ మల్లె వేళ సిగ్గు సిగ్గు లయలోలికే వ్యవహారం
మది అలవాటుకొచ్చి గుచ్చి చూసి మనసడిగే చెలగాటం |హు| |మచిలిపట్న|

తందాన తందాన ఊసు కనుల తందాన
ఊరించె పెట్టు తేనె
తందాన తందాన పాటక్కొక్క తందాన
చెవినిండా గుమ్మ తేనె
వయసులలో వరసలలో తెలియందిలె
మనసుపడె మౌనసుఖమె విరహానిదె
తందాన తందాన మేఘరాగం తందాన
వచ్చె వచ్చె వాన జల్లె
మధురస మాఘ వేళ కన్నుగీటి కథ నడిపే సాయంత్రం
తొలి చెలి గాలి సోలి కొథ్త తోడు కలిసినదె చెలగాటం |హు|

కిన్నెరసాని వచ్చిందమ్మా

 

చమ్మక్కు చమ్మక్కు జింజిన్న జింజిన్న
చమ్మక్కు చమ్మక్కు జిన్నా జిన్నా జిన్నా

కిన్నెరసాని వచ్చిందమ్మా వెన్నెల పైటేసి
విశ్వనాధ పలుకై అది విరుల తేనె చినుకై
కూనలమ్మ కులుకై అది కూచిపూడి నడకై
పచ్చని చేల తననన పావడ గట్టీ తననన
కొండమల్లెలె కొప్పునబెట్టి వచ్చె దొరసాని మా వన్నెల కిన్నెరసాని
కిన్నెరసాని వచ్చిందమ్మా వెన్నెల పైటేసి |2|

ఎండల కన్నె సోకని రాణి
పల్లెకు రాణి పల్లవపాణి
తోటను విడిచి పేటను విడిచి
కలల గంగ పొంగే వేళ
నదిలా తానె సాగే వేళ
రాగాల గోదారి పూదారి అవ్తుంటే
ఆ రాగాల గోదారి పూదారి అవ్తుంటే
కిన్నెరసాని వచ్చిందమ్మా వెన్నెల పైటేసి |2|

మాగాణమ్మ చీరలు నేసె
మలి సందెమ్మ కుంకుమ పూసే
మువ్వుల బొమ్మా ముద్దుల గుమ్మా
మువ్వుల బొమ్మా ముద్దుల గుమ్మా
గడప దాటి నడిచే వేళ
అదుపే విడిచి ఎగిరే వేళ
వయ్యారి అందాలు గోదారి చూస్తుంటే
ఈ వయ్యారి అందాలు గోదారి చూస్తుంటే |కిన్నెరసాని|

తెలుగు పదానికి జన్మదినం

annamayya

తెలుగు పదానికి జన్మదినం ఇది జానపదానికి జ్ఞానపధం
ఏడు స్వరాలే ఏడు కొండలై వెలసిన కలియుగ విష్ణుపధం
అన్నమయ్య జననం ఇది అన్నమయ్య జననం ఇది అన్నమయ్య జననం

అరిషడ్వర్గము తెగనరికె హరి ఖడ్గమ్మిది నందకము
బ్రహ్మ లోకమున బ్రహ్మాభారతి నాదాశీస్సులు పొందినదై
శివలోకమ్మున చిద్విలాసమున డమరుధ్వనిలో గమకితమై
దివ్యసభలలో నవ్యలాస్యముగ పూబంతిల చేబంతిగ ఎగసి
నీరదమండల నారద తుంబుర మహతీదాసుల మహిమలు తెలిసి
శితహిమ గంధర  యతిరాజస్సభలో తపః ఫలమ్ముగ తలుకుమని
తల్లితనముకై తల్లడిల్లు ఆ లక్కమాంబ గర్భాశయమ్ములో
ప్రవేశించె ఆ నందకము నందనానంద తారకము
అన్నమయ్య జననం ఇది అన్నమయ్య జననం ఇది అన్నమయ్య జననం

పద్మావతియే పురుడు పోయగా పద్మాసనుడె ఉసురు పోయగ
విష్ణుతేజమై నాద బీజమై ఆంధ్ర సాహితీ అమర కోశమై
అవతరించెను అన్నమయ అసతోమా సద్గమయ
అవతరించెను అన్నమయ అసతోమా సద్గమయ

పాపడుగ నట్టింట పారుతు భాగవతము చేపట్టెనయ
హరినామమ్మును ఆలకింపక అరముద్దలనె ముట్టడయా
తెలుగు భారతికి వెలుగు హారతిగ
యద లయలొ పద కవితలు కలయ
తాళ్ళపాకలో యెదిగె అన్నమయ
తమసోమ జ్యోతిర్గమయా   తమసోమ జ్యోతిర్గమయా

కన్నులదా ఆశలదా

images

 

కన్నులదా  ఆశలదా బుగ్గలదా ముద్దులదా
పెనవేసుకున్న పెదవులదా నువు కోరుకున్న సొగసులదా
మదిలో మెదిలే వలపుల మొలకా నాలో ప్రాణం నీవెకదా
అలలా కదిలే వలపుల చిలకా అందని అందం నీదెకదా

ఎదేదొ పాడుతూ నా మీదే వాలుతు
హద్దుల్ని దాటుతు మాయల్నె చేయకు
గుండెల్లొ ఆడుతు కళ్ళల్లొ సోలుతు
నీ కొంటె చూపుల గాలమే వేయకు
హృదయం ఉదయం కలిసెనమ్మ
వయసె విరిసెనమ్మ
అమృతం  పొంగి అనువనువు వలపే కురిసెనమ్మ
ముద్దుల్నె పేర్చవా ముచట్ట్లె ఆడవా
నా మీదె చాలగ నీ వొడి చెర్చవా

కన్నులదో  ఆశలదో  బుగ్గలదో  ముద్దులదో
మదిలో మెదిలే వలపుల మొలకా నాలో ప్రాణం నీవెకదా