ఎపుడు నీకు నే తెలుపనిది

newpg-sontham37

Movie Sontam
Singers Sumangali
Music Director Devi Sri Prasad
Lyrics Sirivennela

ఎపుడు నీకు నే తెలుపనిది
ఇకపై ఎవరికీ తెలియనిది
మనసె మోయగలదా జీవితాంతం

వెతికె తీరమె రానంది
బతికె దారినె మూసింది
రగిలె నిన్నలేనా నాకు సొంతం
సమయం చేదుగా నవ్వింది
హృదయం బాధగా చూసింది
నిజమె నీడగా మారింది

ఎపుడు నీకు నే తెలుపనిది
ఇకపై ఎవరికీ తెలియనిది
మనసె మోయగలదా జీవితాంతం

గుండెలో ఆశనె తెలుపనెలేదు నా మౌనం
చూపులో భాషనె చదువనేలేదు నీ స్నేహం
తలపులో నువ్వు కొలువున్నా కలుసుకోలేను ఎదురున్నా
తెలిసి ఈ తప్పు చేస్తున్నా అడగవే ఒక్కసారైనా
నేస్తమా నీ పరిచయం కల కరిగించేటి కన్నీటి వానే కాదా

గుప్పెడు గుండెను తడితె

images

గుప్పెడు గుండెను తడితె దాని చప్పుడు పేరు సంగీతం
కొప్పున మల్లెలు పెడితె అది చప్పున రమ్మని సంకేతం
అదిరి పడిన పెదవికేంటి అర్థం
అడుగుతోంది ఎదురు చూసి అధర కాగితం నీ మధుర సంతకం
అధర కాగితం మధుర సంతకం

తనన తననన తనన తననన
తనన తననన తానన తనననానా

గుప్పెడు గుండెను తడితె దాని చప్పుడు పేరు సంగీతం
కొప్పున మల్లెలు పెడితె అది చప్పున రమ్మని సంకేతం
అదిరి పడిన పెదవికేంటి అర్థం
అడుగుతోంది ఎదురు చూసి అధర కాగితం నీ మధుర సంతకం
అధర కాగితం మధుర సంతకం

స సగసని స పని స సగసని స
స సగసని స పని స సగసని స
స సగమప మ పని స సగమపమ
పపప మమమ గమగస
పపప మమమ గమగరి

కిలకిలా… కులికితె…
ఒంటి పేరె సుందరం కంటి ముందె నందనం
చిలకలా…. పలికితె….
ఉండి పోదా సంబరం గుండె కాదా మందిరం
జాబిల్లి జాబు రాసి నన్నె కోరె పరిచయం
పున్నాగ పూలు పూసె వన్నె చిన్నె రసమయం
ఎందువల్లో ముందులేని కలవరం
అదిరి పడిన పెదవికేంటి అర్థం
అడుగుతోంది ఎదురు చూసి అధర కాగితం నీ మధుర సంతకం
అధర కాగితం మధుర సంతకం
గుప్పెడు గుండెను తడితె దాని చప్పుడు పేరు సంగీతం
కొప్పున మల్లెలు పెడితె అది చప్పున రమ్మని సంకేతం

తనన తననన తనన తననన
తనన తననన తానన తనననానా
వలపులా…. వాలితె….
కన్నె పైటే స్వాగతం కన్న కలలె అంకితం
చెలిమిలా…. చేరితె….
పల్లె సీమే పావురం పిల్ల ప్రేమె వాయనం
సింధూర పూల వాన నిన్ను నన్ను తడపని
అందాల కోనలోన హాయి రేయి గడపని
కొత్తగున్నా మత్తుగుంది మన జగం