నీ ప్రశ్నలు నీవే

Movie Kotha Bangaru lokam
Singer S.P.Balasubrahmanyam
Music Director Mickey J Meyer
Lyrics Sirivennela Sitarama Sastry

నీ ప్రశ్నలు నీవే ఎవ్వరో బదులివ్వరుగా
నీ చిక్కులు నీవే ఎవ్వరూ విడిపించరుగా
ఏ గాలో నిన్ను తరుముతుంటే అల్లరిగా
ఆగాలో లేదో తెలియదంటే చెల్లదుగా
పది నెలలు తనలో నిన్ను మోసిన అమ్మైనా
అప్పుడో ఇప్పుడు కననే కనను అంటుందా
ప్రతి కుసుమం తనదే అనదె విరిసే కొమ్మైనా
గుడికో జడకో సాగనంపక వుంటుందా
బతుకంటే బడి చదువా అనుకుంటే అతి సులువా
పొరపడిన పడినా జలిపడదె కాలం మనలాగా
ఒక నిమిషం కూడా ఆగిపోదె నువ్వొచేదాక

అలలుండని కడలేదని అడిగేందుకే తెలివుందా
కలలుండని కనులేవని నిత్యం నిదరోమందా
గతముందని గమనించని నడిరేయికి రేపుందా
గతి తోచని గమనానికి గమ్యం అంటూ వుందా
వలపేదో వలవేస్తుంది వయసేమో అటు తోస్తుంది
గెలుపంటే ఏదో ఇంతవరకు వివరించే రుజువేముంది
సుడిలో పడు ప్రతి నావా…చెబుతున్నది వినలేవా

పొరపాటున చెయి జారిన తరుణం తిరిగొస్తుందా
ప్రతిపూటొక పుటలా తన పాఠం వివరిస్తుందా
మనకోసమె తనలో తను రగిలే రవి తపనంతా
కనుమూసిన తరువాతనె పెను చీకటి చెబుతుందా
కడతేరని పయనాలెన్ని పడదోసిన ప్రణయాలెన్ని
అని తిరగేసాయా చరిత పుటలు వెను చూడక వురికే వెతలు
తమ ముందు తరాలకు స్మృతుల చితులు అందించాలా ప్రేమికులు
ఇది కాదె విధి రాత…అనుకోదేం ఎదురీత

పది నెలలు తనలో నిన్ను మోసిన అమ్మైనా
అప్పుడో ఇప్పుడు కననే కనను అంటుందా
ప్రతి కుసుమం తనదే అనదె విరిసె కొమ్మైనా
గుడికో జడకో సాగనంపక వుంటుందా
బతుకంటే బడి చదువా అనుకుంటె అతి సులువా
పొరపడిన పడినా జలిపడదె కాలం మనలాగా
ఒక నిమిషం కూడా ఆగిపోదె నువ్వొచేదాక

మేఘాలు లేకున్నా

మేఘాలు లేకున్నా నా పైన ఈ వాన రాగాలు తీసే నీ వల్లేనా
ఏ గాలి లేకున్నా నే తేలిపొతున్న ఈ మాయలన్ని నీ వల్లేనా
వెళ్ళె దారిలొ లేడె చంద్రుడే ఐనా వెన్నెలే అది నీ అల్లరేనా
చెట్టు నీడనైనా లేనే పైన పూల వాన  |మేఘాలు|

కోపముంటె నేరుగా చూపకుండా ఇలా.. రాతిరంత నిద్దురె పాడుచేస్తె ఎలా
నేరముంటె సూటిగ చెప్పకుండా ఇలా.. మేలుకున్న కలలతో వేస్తావుగా సంకెల
పూట పూట పొలమారుతుంటె అసలింత జాలి లేదా..
నేను కాక మరి నేల మీద తలిచేటి పేరు లేదా..
క్షణమైనా నిలబడనిస్తే నీకు ఊసుపోదా  |మేఘాలు|

మాటలోన లేదుగ ముద్దు చెప్పే నిజం చూపులోన లేదుగ స్పర్శ చెప్పే నిజం
సైగలోన లేదుగ గిల్లి చెప్పె నిజం నవ్వుకన్నా నాకిల నీ పంటి గాటే నిజం
కింద మీద పడి రాసుకున్న పది కాగితాల కవిత ఎంత కైన అది ఆనదంట ఒక కౌగిలింత ఎదుటా
మన మధ్య దారం కైన దారి ఎందుకంట  |మేఘాలు|