నీలాకాశం లో

Movie Sukumarudu
Singer Shreya Ghoshal
Music Director Anoop Rubens
Lyrics Sri Mani

నీలాకాశం లో మెరిసే చంద్రుడివే
రివ్వున నేలకు జారి నాకై వచ్చావే
పొంగే నదిలా నన్నే మార్చావే
చిన్ని గుండెల్లోన అలజడి రేపావే
ఉక్కిరి బిక్కిరి అయ్యా నీ ఊహల జడిలో
చక్కిలిగింతలు మొదలాయే ఇక నా ఒడిలో
నీవల్లే నీవల్లే రా సుకుమారా
ఈ మాయ నీవల్లే రా
ఎదో అయ్యింది ఈవేళ ఇన్నాళ్ళు లేదిలా

సరదాకైన ఏ ఆడపిల్లైన
నిను చూస్తుంటే వుండగలనా
నిన్నే దాచేసి లేవుపొమ్మంటా
నీకే నిన్నే ఇవ్వనంటా
నిన్నే తాకిందని గాలి తోటి
రోజూ గొడవేనంట
నిన్ను నువ్వైన నాలాగ ప్రేమించలేవంట

నీలకాశం లో మెరిసే చంద్రుడివే
రివ్వున నేలకు జారి నాకై వచ్చావే

రహదారుల్లో పూలు పూయిస్తా
నాదారంటూ వస్తానంటే
మహరాణల్లే నన్ను చూపిస్తా
నాపై కన్నె వేస్తానంటే
అరే ఏంటో క్షణమైనా నిన్ను చూడకుంటే
ఆగదు ప్రాణం
ఇలా నువ్వంటే పడి చచ్చే నేనంటే నాకిష్టం

నీలాకాశం లో మెరిసే చంద్రుడివే
రివ్వున నేలకు జారి నాకై వచ్చావే
పొంగే నదిలా నన్నే మార్చావే
చిన్ని గుండెల్లోన అలజడి రేపావే
ఉక్కిరి బిక్కిరి అయ్యా నీ ఊహల జడిలో
చక్కిలిగింతలు మొదలాయే ఇక నా ఒడిలో
నీవల్లే నీవల్లే రా సుకుమారా
ఈ మాయ నీవల్లే రా
ఎదో అయ్యింది ఈవేళ ఇన్నాళ్ళు లేదిలా

చినుకు తాకే జడిలో

చినుకు తాకే జడిలో చిగురు తొడిగే చెలిమే విరిసే హరివిల్లులే
యెదుట నిలిచే నిజమే కలలు పంచే తీరే చిలికే చిరునవ్వులే
మునుపు కనుగొనని ఆనందమేదో కలిగే నాలోన ఈవేళనే
యెగిసి ఉప్పొంగి ఊహల్లో మునుగి ఉన్నాలే
పలకరించే ఆశె పరవశాన్నే పెంచె చిలిపి కేరింతలా
కలవరింతే తరిమి పరుగులెత్తే మనసే ఉడిసి పట్టేదెలా
నాలోనే దాగి నిదురించు నన్నే తట్టి లేపింది నీవే సుమా
ఇంత అందంగా లోకాన్ని నేడే చూస్తున్నా

నేనేనా ఇది అంటూ అనిపించినా అవునవును నేనే మరి కాదా
చిత్రంగా నాకే నె కనిపించినా కవ్వించే చిత్రాన్నయ్యాగా
నా దారినే మళ్ళించినా తుళ్ళింతలా వరదలా
పాదాలనే నడిపించిన రహదారి వయ్యావెలా
నేరుగా సరాసరి నేనిలా మారగా మరి మరి తీరుగా

పలకరించే ఆశె పరవశాన్నే పెంచె చిలిపి కేరింతలా
కలవరింతే తరిమి పరుగులెత్తే మనసే ఉడిసి పట్టేదెలా
నాలోనే దాగి నిదురించు నన్నే తట్టి లేపింది నీవే సుమా
ఇంత అందంగా లోకాన్ని నేడే చూస్తున్నా

తాను నేను

Movie Sahasam swasaga sagipo
Singer Vijay Prakash
Music Director A.R.Rahman
Lyrics Ananta Sriram

తాను నేను మోయిలు మిన్ను
తాను నేను కలువ కొలను
తాను నేను పైరు చేను
తాను నేను వేరు మాను
శశి తానైతే నిశినే నేను
కుసుమం తావి తాను నేను
వెలుగు దివ్వె తెలుగు తీపి
తాను నేను మనసు మాను

దారి నేను తీరం తాను
దారం నేను హారం తాను
దాహం నేను నీరం తాను
కావ్యం నేను సారం తాను
నేను తాను రెప్ప కన్ను
వేరై పోనీ పుడమి మన్ను
నేను తాను రెప్ప కన్ను
వేరై పోనీ పుడమి మన్ను

తాను నేను మోయిలు మిన్ను
తాను నేను కలువ కొలను
తాను నేను గానం గమకం
తాను నేను ప్రాయం తమకం

తాను నేను మోయిలు మిన్ను
తాను నేను కలువ కొలను
తాను నేను పైరు చేను
తాను నేను వేరు మాను
శశి తానైతే నిశినే నేను
కుసుమం తావి తాను నేను
వెలుగె దివ్వె తెలుగు తీపి
తాను నేను మనసు మేను
మనసు మేను మనసు మేను
మనసు మేను మనసు మేను

నువ్వంటే నా నువ్వు

 

నువ్వంటే నా నువ్వు నేనంటేనే నువ్వు
నువ్వంటు నేనంటు లేమని
ఔవునంటు మాటివ్వు నిజమంటునే నువ్వు
నే రాని దూరాలు నువు పోనని
ఎటువున్నా నీ నడక వస్తాగ నీ వెనుక
దగ్గరగా రానీను దూరమే
నే వెసే ప్రతి అడుగు ఎక్కడికో నువ్వడుగు
నిలుచున్న నీ వైపే చేరేనులే
నీ అడుగేమొ పడి నేల గుడి ఐనదే
నీ చూపేమో సడి లేని ఉరుమైనదే
నువ్వు ఆకాశం నేను నీ కోసం
తడిసిపోదామా ఈ వానలో
ఈ చినుకు ఆ మేఘం విడిపోవసలే
సుర్యుడితో జతకట్టి ఒకటవుతాయే
నీడల్లో నలుపల్లే మల్లెల్లో తెలుపల్లే
ఈ భువికే వెలుగిచ్చే వరమే ఈ ప్రేమ ||ఈ చినుకు||

నే ఇటు వస్తాననుకోలేదా
తలుపస్సలు తీయవు తడితే
పో పసివాడని జాలేపడితే
బుగ్గన ముద్దిచ్చి చంపేసావే
నువ్వు నేనంటు పలికే పదముల్లో
అధరాలు తగిలేనా కలిసేవున్నా
మనమంటు పాడు పెదవుల్లో చూడు
క్షణమైన విడిపోవులే
ఇది ఓ వేదం పద ఋజువౌవుదాం
అంతులేని ప్రేమకే మనం
నివురు తొలిగేలా నిజము గెలిచేలా
మౌనమే మాట మార్చేసెనా

నా నవ్వేటి కోపానివే
మనసతికిన ఓ రాయివే
నువ్ కలిసొచ్చె శాపానివే
నీరల్లే మారేటి రూపానివే
నచ్చే దారుల్లో నడిచే నదులైనా
కాదన్నా కలవాలి సంద్రంలోన
విడి విడి గా వున్నా విడిపోలేకున్న
ప్రవహించే ప్రణయం ఇదే
వద్దన్నా తిరిగేటి భువిమీదొట్టు
నా ప్రాణం తిరిగేనే ఇక నీ చుట్టూ
నాలోనే నువ్వుంటు నీతోనే నేనంటు
ఈ భువిలో విహరించే వెలుగే మన ప్రేమా

నాలో నేనేనా

నాలో నేనేనా
ఏదో అన్నానా
నాతో నే లేని మైమరపున
ఏమో అన్నానేమో నువ్వు విన్నావేమో
విన్న మాటేదో నిన్నడగనా   ||నాలో ||

అలా సాగిపోతున్న నాలోన
ఇదేంటిలా కొత్త ఆలోచన
మనసే నాది మాటే నీది
ఇదేం మాయో
నాలో నేనేనా
ఏదో అన్నానా
నాతో నే లేని మైమరపున
ఏమో అన్నానేమో నువ్వు విన్నావేమో
చిన్న మాటేదో నిన్నడగనా

అవును కాదు తడబాటుని
అంతో ఇంతో గడి దాటనీ
విడి విడిపోని పరదాని
పలుకై రాని ప్రాణాన్ని
యెదంతా పదాల్లోన పలికేన
నా మౌనమే ప్రేమ ఆలాపన
మనసే నాది మాటే నీది
ఇదేం మాయో     ||నాలో ||

దైవం వరమై దొరికిందనీ
నాలో సగమై కలిసిందనీ
మెలకువ కానీ హృదయాన్ని
చిగురైపోని శిశిరాన్ని
నీతో చెలిమి చేస్తున్న నిమిషాలు
నూరేళ్ళుగా యెదిగి పోయాయిలా
మనమే సాక్ష్యం
మాటే మంత్రం
ప్రేమే బంధం ||నాలో ||

ప్రేమ పూసెనోయ్

premam-7591

ప్రేమ పూసెనోయ్ వాడి పోయెనోయ్
రెక్కలన్ని రాలిపోయెనోయ్ ||2|
పువ్వు చాటు ముల్లు లా మెల్లంగ గుచ్చినాది
నొప్పి కూడ చెప్పకోని తీరు బాధపెట్టెనోయ్
ఈ తేనె పరిమళం తీయంగ లేదురో
ఆ చేదు మాటవింటే ప్రాణమాగిపోయెరో||2|
రెక్కలెన్నొ తెచ్చి ఆకశాన్ని ఊపినానే
లెక్కలేని పూలచుక్కలెన్నొ తెంచినానె
ముళ్ళు గుచ్చుతున్న గుండె నొచ్చుతున్న
భాదింత అంత కాదె
అద్దం లో నన్ను నేను చూసుకుంటే
నా గుండె బుజ్జగించినట్టు వుందె
ఎంత చెప్పుకున్న ఓటమొప్పుకున్న
నా ఏడుపాగదాయె
చూసి చూసి నన్ను పావులా భలేగ
వాడుతున్న తీరు చూడరా
నా చుట్టు ఇందరున్న నవ్వింది నన్ను చూసి
ఈ వింతగున్న ఆటలేంటి ఓరి దేవుడా ||ప్రేమ||

నీ ప్రశ్నలు నీవే

Movie Kotha Bangaru lokam
Singer S.P.Balasubrahmanyam
Music Director Mickey J Meyer
Lyrics Sirivennela Sitarama Sastry

నీ ప్రశ్నలు నీవే ఎవ్వరో బదులివ్వరుగా
నీ చిక్కులు నీవే ఎవ్వరూ విడిపించరుగా
ఏ గాలో నిన్ను తరుముతుంటే అల్లరిగా
ఆగాలో లేదో తెలియదంటే చెల్లదుగా
పది నెలలు తనలో నిన్ను మోసిన అమ్మైనా
అప్పుడో ఇప్పుడు కననే కనను అంటుందా
ప్రతి కుసుమం తనదే అనదె విరిసే కొమ్మైనా
గుడికో జడకో సాగనంపక వుంటుందా
బతుకంటే బడి చదువా అనుకుంటే అతి సులువా
పొరపడిన పడినా జలిపడదె కాలం మనలాగా
ఒక నిమిషం కూడా ఆగిపోదె నువ్వొచేదాక

అలలుండని కడలేదని అడిగేందుకే తెలివుందా
కలలుండని కనులేవని నిత్యం నిదరోమందా
గతముందని గమనించని నడిరేయికి రేపుందా
గతి తోచని గమనానికి గమ్యం అంటూ వుందా
వలపేదో వలవేస్తుంది వయసేమో అటు తోస్తుంది
గెలుపంటే ఏదో ఇంతవరకు వివరించే రుజువేముంది
సుడిలో పడు ప్రతి నావా…చెబుతున్నది వినలేవా

పొరపాటున చెయి జారిన తరుణం తిరిగొస్తుందా
ప్రతిపూటొక పుటలా తన పాఠం వివరిస్తుందా
మనకోసమె తనలో తను రగిలే రవి తపనంతా
కనుమూసిన తరువాతనె పెను చీకటి చెబుతుందా
కడతేరని పయనాలెన్ని పడదోసిన ప్రణయాలెన్ని
అని తిరగేసాయా చరిత పుటలు వెను చూడక వురికే వెతలు
తమ ముందు తరాలకు స్మృతుల చితులు అందించాలా ప్రేమికులు
ఇది కాదె విధి రాత…అనుకోదేం ఎదురీత

పది నెలలు తనలో నిన్ను మోసిన అమ్మైనా
అప్పుడో ఇప్పుడు కననే కనను అంటుందా
ప్రతి కుసుమం తనదే అనదె విరిసె కొమ్మైనా
గుడికో జడకో సాగనంపక వుంటుందా
బతుకంటే బడి చదువా అనుకుంటె అతి సులువా
పొరపడిన పడినా జలిపడదె కాలం మనలాగా
ఒక నిమిషం కూడా ఆగిపోదె నువ్వొచేదాక

మేఘాలు లేకున్నా

మేఘాలు లేకున్నా నా పైన ఈ వాన రాగాలు తీసే నీ వల్లేనా
ఏ గాలి లేకున్నా నే తేలిపొతున్న ఈ మాయలన్ని నీ వల్లేనా
వెళ్ళె దారిలొ లేడె చంద్రుడే ఐనా వెన్నెలే అది నీ అల్లరేనా
చెట్టు నీడనైనా లేనే పైన పూల వాన  |మేఘాలు|

కోపముంటె నేరుగా చూపకుండా ఇలా.. రాతిరంత నిద్దురె పాడుచేస్తె ఎలా
నేరముంటె సూటిగ చెప్పకుండా ఇలా.. మేలుకున్న కలలతో వేస్తావుగా సంకెల
పూట పూట పొలమారుతుంటె అసలింత జాలి లేదా..
నేను కాక మరి నేల మీద తలిచేటి పేరు లేదా..
క్షణమైనా నిలబడనిస్తే నీకు ఊసుపోదా  |మేఘాలు|

మాటలోన లేదుగ ముద్దు చెప్పే నిజం చూపులోన లేదుగ స్పర్శ చెప్పే నిజం
సైగలోన లేదుగ గిల్లి చెప్పె నిజం నవ్వుకన్నా నాకిల నీ పంటి గాటే నిజం
కింద మీద పడి రాసుకున్న పది కాగితాల కవిత ఎంత కైన అది ఆనదంట ఒక కౌగిలింత ఎదుటా
మన మధ్య దారం కైన దారి ఎందుకంట  |మేఘాలు|

ఒక లైఫ్

index

 

Movie Oopiri
Singer Karthik
Music Director Gopi Sunder
Lyrics Sirivennela Sitarama Sastry

ఒక లైఫ్ ఒకటంటె ఒకటె లైఫ్
ఒక లైఫ్ ఒకటంటె ఒకటె లైఫ్
ఇది కాదె అనుకుంటు వదిలేస్తె వేరె అవకాశం రాదె
ఇది ఇంతె అనుకుంటే వందేళ్ళు నేడే జీవించె వీలుందే
ఒక లైఫ్ ఒకటంటె ఒకటె లైఫ్ |2|

ఏం ఏంలేదని మనం చూడాలిగాని
ఊపిరి లేదా ఊహల్లేవా
నీ కోసం నువ్వే లేవా
చీకటికి రంగులేసె కలలెన్నో నీ తోడై వస్తుండగ
ఒంటరిగ లైఫ్ అని
ఆశకి కుడా ఆశని కలిగించెయ్
ఆయువునదెవుండెవరకు ఇంకెదొ లేదని అనకు
ఒక్కో క్షణము ఈ బ్రతుకు కొత్తదె నీకు

ఒక లైఫ్ ఒకటంటె ఒకటె లైఫ్ |2|
ఇది కాదె అనుకుంటు వదిలేస్తె వేరె అవకాశం రాదె
ఇది ఇంతె అనుకుంటే వందేళ్ళు నేడే జీవించె వీలుందే

దోబూచులాటేలరా

దోబూచులాటేలరా గోపాల నా మనసంత నీవేనురా
ఆ యేటి గట్టునేనడిగ చిరు గాలి నాపి నేనడిగ |2|
ఆకాశాన్నడిగా బదులే లేదు |2|
చివరికి నిన్నే చూసా హృదయపు గుడిలో చూసా |2| |దో|

నా మది నీకొక ఆటాడు బొమ్మయ |2|
నాకిక ఆశలు వేరేవి లేవయ
యదలో రొద ఆగదయ
నీ అధరాలు అందించ రా గోపాల |2|
నీ కౌగిలిలో కరిగించ రా
నీ తనువే ఇక నా వలువా
పాలకడలి నాడి నా గానం నీ వన్నె మారలేదేమి |2|
నా యదలో చేరి వన్నె మార్చుకో
ఊపురి నీవైయి సాగ పెదవుల మెరుపు నువు కాగ
చెరగ రా |దో|

గగనమె వర్షించ గిరి నెత్తి కాచావు
నయనాలు వర్షించ ననెత్త బ్రోచేవు
పూవున కన్నె నీ మతమా
నేనొక్క స్త్రీ నె కదా గోపాల
అది తిలకించ కనులే లేవా
నీ కలలె నేనే కదా
అనుక్షణము ఉలికె నా మనసు అరె మూగ కాదు నా వయసు
నా ఊపిరిలోన ఊపిరి నీవై
ప్రాణం పోనికుండ ఎపుడు నీవె అండ
కాపాడ రా |దో|